జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. తాను ఎప్పుడు ఓకే చెబితే ఆరోజే ఈవెంట్ జరుపుతామని ఇప్పటికే స్పష్టం చేశారు దిల్ రాజు. జనవరి 1న మూవీ ట్రైలర్ ను, 10న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఇప్పటికే మెగా అభిమానులు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ మూవీ కావడంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అమెరికాలోని డల్లాస్ లో చిత్రానికి సంబంధించి ఈవెంట్ నిర్వహించారు. భారీ ప్రజాదరణ చోటు చేసుకుంది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ కావడం విశేషం. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా శంకర్ ఉన్నారు. ఇప్పిటికే ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లకు పైగానే అయ్యిందని అంచనా.