సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్లదు
ప్రముఖ నిర్మాత నాగ వంశీ
హైదరాబాద్ – ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు. తాను ఇక్కడ డబ్బులు పెట్టానని, ఇళ్లు కట్టుకున్నానని అక్కడికి వెళ్లి ఏం చేస్తానంటూ ప్రశ్నించారు. సినీ రంగానికి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సమానమేనని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో త్వరంలో సినీ రంగపు పెద్దలు కలుస్తారన్న విషయం తనకు తెలియదన్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు అరెస్ట్ కూడా చేశారు. ఒక రోజు చంచల్ గూడ జైలులో ఉండి వచ్చారు.
తను నటించిన పుష్ప ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చని పోయింది. కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. ఈ తరుణంలో ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఏకంగా అల్లు అర్జున్ ఇంటిపైకి వెళ్లారు. రాళ్లు రువ్వారు.