బాదల్ ను పోలీసులు రక్షించారు – సీఎం
ఈ ఘటన జరగడం బాధాకరం
పంజాబ్ – పంజాబ్ స్వర్ణ దేవాలయం ఆవరణలో శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది. అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై స్పందించారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పంజాబీల పరువు తీసే కుట్ర విఫలమవడం పంజాబ్ పోలీసుల సత్వర ఫలితమేనని స్పష్టం చేశారు. పోలీసులు తమ సత్వరమార్గంతో దుండగుడిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి ఘన విజయం సాధించారని అన్నారు సీఎం.
పోలీసుల సత్వర చర్యలను తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు, సుఖ్‌బీర్ బాదల్ జీపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేత డాక్టర్ దిల్జీత్ సింగ్ చీమా. ఇది పూర్తిగా పంజాబ్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు . సీఎం భగవంత్ మాన్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.