ప్రారంభం అదిరినా చివరలో నిరాశ
రాజస్థాన్ – ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది. సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో మైదానంలోకి వచ్చినా గెలిపించ లేక పోయాడు. ఇక ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఇంకో మ్యాచ్ తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది పంజాబ్ కు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీ తోడైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 219 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 207 రన్స్ చేసింది. మరో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే వధేరా, శశాంక్ సూపర్ షో ప్రదర్శించారు. నేహాల్ 70 రన్స్ చేయగా కెప్టెన్ అయ్యర్ 30 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు చేశాడు శశాంక్ సింగ్. తను 59 కీలక రన్స్ చేసి పంజాబ్ బిగ్ స్కోర్ పెరిగేలా చేశాడు. అజ్మతుల్లా 21 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 5 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యం ముందుంచింది.
220 రన్స్ లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో అదిరింది. సూపర్ గా ఆడినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్ మరోసారి సత్తా చాటాడు. తను 9 ఫోర్లు 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక యువ కెరటం వైభవ్ సూర్య వంశీ కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. పంజాబ్ బౌలర్లను ఉతికేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ 20 రన్స్ చేశాడు. ఆశించిన రీతిలో ఆడలేదు. పరాగ్ 13, హెట్మెయర్ 11 పరుగులతో వెనుదిరిగారు. చివరగా ధ్రువ్ జురైల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. తను 53 పరుగులు చేశాడు.