రూ. 18 కోట్లకు చాహల్ పంజాబ్ స్వంతం
భారీ ధర పలికిన ముంబై స్పిన్నర్
జెడ్డా – వచ్చే ఏడాది టాటా ఐపీఎల్ టోర్నీకి సంబంధించి జెడ్డా వేదికగా వేలం పాట కొనసాగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. భారీ ఎత్తున పోటీ నెలకొంది . ఆటగాళ్లను స్వంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అందరూ అనుకున్నట్టుగానే రిషబ్ పంత్ , శ్రేయస్ అయ్యర్ లు భారీ ధరకు అమ్ముడు పోయారు. ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ సృష్టించారు పంత్. తనను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు తీసుకుంది. అంతకు ముందు సన్ రైజర్స్ రూ. 18 కోట్లకు ఆఫర్ ఇచ్చింది. కానీ వర్కవుట్ కాలేదు.
ఇదే సమయంలో మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అమ్ముడు పోయాడు. తనను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ స్వంతం చేసుకుంది. ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ మిల్లర్ ను రూ. 7.50 కోట్లకు తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహల్ కు పంట పండింది. అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు స్వంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఇది బంపర్ ఆఫర్ అని చెప్పక తప్పదు.
ఇక సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఇప్పటికే పేరు పొందిన కోల్ కతా కు చెందిన మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ. 10 కోట్లకు తీసుకుంది. బౌలింగ్ పరంగా మరింత బలం పెంచుకునేందుకు ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మారన్ ఫోకస్ పెట్టింది.