లారెన్స్ బిష్ణోయ్ పై ఎఫ్ఐఆర్ రద్దుకు సిఫార్సు
ఇప్పటికే అమిత్ చంద్ర షాతో సీఎం మాన్ భేటీ
పంజాబ్ – ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ గా పేరు పొందాడు లారెన్స్ బిష్ణోయ్. తాజాగా ముంబై బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు భారీ ఎత్తున లారెన్స్ నుంచి ముప్పు పొంచి ఉందని సమాచారం అందింది. దీంతో సర్కార్ సదరు నటుడికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచింది.
ఇదే సమయంలో ఎన్సీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణంగా హత్యకు గురి కాబడ్డాడు. ముగ్గురు అగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఆయనపై కాల్పుల ఘటన ఒక్కసారిగా ముంబై వాసులను విస్తు పోయేలా చేసింది. దీని వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదే సమయంలో లారెన్స్ కు జంతువులంటే పిచ్చి ప్రేమ. అంతే కాదు తనకు భారత దేశం అంటే అభిమానం కూడా. ఓ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ జింకను వేటాడి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు లారెన్స్ బిష్ణోయ్. ఎక్కడ ఉన్నా చంపి తీరుతానంటూ శపథం చేశాడు.
ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్నాడు లారెన్స్ బిష్ణోయ్. ఇదిలా ఉండగా పంజాబ్ ప్రభుత్వం అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆరు అభియోగాలు మోపారు. నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని పంజాబ్ పోలీసులు సర్కార్ కు సిఫారసు చేశారు.
కరడు గట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది అమృత పాల్ సింగ్ ను పట్టుకునేందుకు లారెన్స్ పై చూసీ చూడనట్లు వ్యవహరించాలని అమిత్ షా సీఎంకు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.