NEWSANDHRA PRADESH

అన్ని రంగాల్లో కుల‌మే కీల‌కం

Share it with your family & friends

మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ పూర్ణ‌చంద‌ర్ రావు

అమ‌రావ‌తి – మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ పూర్ణచంద‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీఎస్పీ లో చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌న‌లోని బాధ‌ను వ్య‌క్తం చేశారు. గుర్రం జాషూవా కావ్యంలోని గబ్బిలంలా నా మనసు తిరుగుతూ ఉందన్నారు.

అట్లా నా మనసు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగింద‌న్నారు.. నన్ను నేను తెలుసుకోవడానికి 62 ఏళ్లు పట్టిందని చెప్పారు. అన్ని రంగాల్లో కులమే రాజ్యమేలుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పూర్ణ చంద‌ర్ రావు.

తాను రిటైరయ్యాక ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేశాను. అక్కడ నేను పోలీసు అధికారిగా అందుకున్న శాలరీకన్నా ఎక్కువ జీతం సంపాదించాను. అయినా నాకు సంతృప్తి లేదు. ఆ సమయంలో కాన్షీరాం సిద్ధాంతం నన్ను ఆకర్శించిందన్నారు.

\ ఒకవేళ ఆధిపత్య పార్టీలు నాకు టిక్కెట్ ఇచ్చినా, గెలిచినా వాళ్ల కనుసన్ననలోనే పని చేయాల్సి ఉంటుంద‌న్నారు పూర్ణ చంద‌ర్ రావు. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. అస్థిత్వం ఉండదు. ఆధిపత్య పార్టీలు ఎన్ని చెప్పినా ఒక ముసుగు మాత్రమేన‌ని పేర్కొన్నారు.

బహుజనులను పని చేయనివ్వరని ఆరోపించారు. ఆ సమయంలో నాకు నా ఇల్లుగా ఫీలయ్యింది బీఎస్పీ మాత్రమేన‌ని చెప్పారు. బీఎస్పీ నేను పుట్టి పెరిగిన బహుజన పల్లెలా ఉంటుందన్నారు. మనకు ఒక రాముడున్నాడు. ఆయనే కాన్షీరాముడు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.