Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHబిజెపి బలోపేతానికి కృషి చేయాలి

బిజెపి బలోపేతానికి కృషి చేయాలి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి

అమ‌రావ‌తి – బీజేపీ బలోపేతానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. ప్ర‌తి ఒక్క‌రు క‌లిసిక‌ట్టుగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన జరుగుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తూ సమస్యలపై స్పందించడం బిజెపి విధానం అన్నారు.

గతంలో స్కాముల ప్రభుత్వాలు చూశామని మోడీ నేతృత్వంలో సంక్షేమ పథకాల స్కీముల ప్రభుత్వాన్ని చూస్తున్నామని చెప్పారు. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కూడా పాల్గొన్నారు. సూర్యారావుపేటలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు పురందేశ్వరి, సుజనా చౌదరి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అని కొనియాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 52 శాతం ఓట్లు బిజెపికి వస్తాయని అనేక సర్వేలు తెలుపుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బిజెపిలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి బిజెపిలో చేరిన డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, డాక్టర్ పవన్ దంపతులను అభినందించారు. పశ్చిమ లో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments