బాబు ఎందుకు వెళ్లారో తెలియదు
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
గుంటూరు – ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుసకు బావ అయ్యే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. ఆమె పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
మరో వైపు జనసేన తమతోనే ఉందంటోంది బీజేపీ. జనానికి క్లారిటీ రావడం లేదు. ఎవరు ఎవరి వైపు ఉన్నారనేది. ఇక టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని కాషాయం అంటోంది. ఆయనను కలుపుకుంటే ఓట్లు రాక పోగా తమ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే ఛాన్స్ లేక పోలేదని ఆ పార్టీ పెద్దలు పేర్కొంటున్నారు.
బుధవారం గుంటూరులో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడారు. పొత్తు గురించి పార్టీ హై కమాండ్ చూసుకుంటుందని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఢిల్లీ వెళ్లారో తనకు తెలియదన్నారు. ఎవరితో భేటీ అవ్వాలో, ఎవరితో పొత్తులు పెట్టు కోవాలనేది అంతా పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.