ఆ ముగ్గురికి భారత రత్న అవార్డులు
అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశానికి విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి భారత రత్న ప్రకటించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత దేశంలోని అత్యున్నతమైన పురస్కారంగా భావిస్తారు భారత రత్న. జీవితంలో ఈ అవార్డును విశిష్ట సేవలు అందించిన వారికి ఇస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముగ్గురికి భారత రత్న ఇస్తున్నట్లు ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీలకు చెందిన నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ , తెలుగువాడైన మాజీ ప్రధాన మంత్రి దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు , హరిత విప్లవ పితామహుడిగా పేరు పొందిన ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న ఇస్తున్నట్లు వెల్లడించారు.
వీరందరికీ ఇవ్వడం సముచితమేనని పేర్కొన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.