ఏపీలో బీజేపీకి ప్రజాదరణ
దగ్గుబాటి పురంధేశ్వరి కామెంట్
విజయవాడ – ఏపీలో గతంలో కంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. విజయవాడలో మంగళవారం బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె దిశా నిర్దేశం చేశారు. రెండు నెలల్లో సార్వత్రిక, శాసన సభ ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు నిబద్దతతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈసారి పోటీ తీవ్రతరం కానుందన్నారు. రోజు రోజుకు బీజేపీలో చేరేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని చెప్పారు దగ్గుబాటి పురందేశ్వరి. అన్ని స్థాయిల్లో క్యాడర్ ను సన్నాహం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఇక పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ విషయంపై తుది నిర్ణయం పార్టీ హై కమాండ్ తీసుకుంటుందని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి. వారి నుంచి ఆదేశాలు వచ్చేంత దాకా క్యాడర్ ను బలోపేతం చేయాలని సూచించారు.