Sunday, April 20, 2025
HomeDEVOTIONALతిరుమలలో ఆరాధనా మహోత్సవాలు

తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు

జ‌న‌వరి 28 నుండి 30వ తేదీ వరకు

తిరుమ‌ల – కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జ‌న‌వరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జరుగనున్నాయి.

మొదటిరో జైన జ‌న‌వరి 28న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సాహిత్య‌ గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌ముఖ పీఠాధిప‌తులు మంగ‌ళా శాస‌న‌ములు అందిస్తారు.

రెండవ రోజైన జ‌న‌వరి 29న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు జ‌న‌వరి 30న ఉదయం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. జ‌న‌వ‌రి 28న తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో “హ‌రిదాస రంజ‌ని” గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments