SPORTS

ప‌ర్పుల్ క్యాప్ విజేత హ‌ర్ష‌ల్ ప‌టేల్

Share it with your family & friends

ఆరెంజ్ క్యాప్ విజేత ర‌న్ మెషీన్

చెన్నై – ఐపీఎల్ 17వ సీజ‌న్ 2024 క‌థ ముగిసింది. శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు విన్న‌ర్ గా నిలిచింది. ఫైన‌ల్ పోరులో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి దుమ్ము రేపింది.

టోర్నీ ముగియ‌డంతో ప‌లు అవార్డుల‌ను ఐపీఎల్ ఎంపిక క‌మిటీ ప్ర‌క‌టించింది. బెస్ట్ క్యాచ‌ర్ గా కోల్ క‌తా జ‌ట్టుకు చెందిన ర‌మ‌ణ్ దీప్ సింగ్ ను ఎంపిక చేసింది. అత్యంత విలువైన ఆట‌గాడిగా కేకేఆర్ కు చెందిన విండీస్ క్రికెట‌ర్ సునీల్ న‌రైన్ కు ద‌క్కింది. త‌ను 488 ప‌రుగుల‌తో పాటు 17 వికెట్లు కూల్చాడు.

ఇక ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగుల ఆట‌గాళ్ల జాబితాలో ఆరెంజ్ క్యాప్ ను ద‌క్కించుకున్నాడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు చెందిన కీల‌క ఆట‌గాడు, ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ. తను టోర్నీలో మొత్తం 741 ప‌రుగులు చేశాడు.

ఇక టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా ప‌ర్పుల్ క్యాప్ విజేత‌గా నిలిచాడు హ‌ర్ష‌ల్ ప‌టేల్. త‌ను మొత్తం 17వ సీజ‌న్ లీగ్ లో 24 వికెట్లు తీశాడు.