నటి శ్రీలీల కెవ్వు కేక
చెన్నైలో పుష్ప -2 ఈవెంట్
తమిళనాడు – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప -2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం గ్రాండ్ గా చెన్నైలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నటి శ్రీలీల.
ఇప్పటికే తను ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించారు. విడుదల చేసిన ఈ సాంగ్ టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతోంది. బీహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. రికార్డ్ స్థాయిలో ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ వచ్చారు.
ప్రత్యేక అతిథిగా బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్ హాజరయ్యారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇక చెన్నైలో ఫ్యాన్స్ సందడి నెలకొంది. పుష్ప రాజ్ పాత్రలో ఇప్పటికే దేశాన్ని ఒక ఊపు ఊపేసిన అల్లు అర్జున్ మరోసారి రికార్డ్ మోత మోగించేందుకు రెడీ అయ్యాడు.
ఇక సినిమా రిలీజ్ కాకుండానే రూ. 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్లు టాక్. తాజాగా జరిగిన కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు శ్రీలీల, రష్మిక మందన్నా. అభిమానులకు గాల్లో ముద్దులు పెట్టారు శ్రీలీల.