బన్నీ..రష్మిక కెమిస్ట్రీ సూపర్
హైదరాబాద్ – భారీ అంచనాల మధ్య పుష్ప 2 ది రూల్ మూవీ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఐ లవ్ యూ పాట్నా అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చెప్పేశారు. ఇక మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. రష్మిక కాలు చూపిస్తే బన్నీ ఉండడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది.
ఇక డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన సుకుమార్ మరోసారి తనదైన మార్క్ ను కనబర్చే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఇది రిలీజ్ కాకుండానే రూ. 1000 కోట్లు వసూలు చేస్తే రేపు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యాక అంతకు రెట్టింపు వసూలు చేస్తుందేమోనని సినీ క్రిటిక్స్ పేర్కొంటున్నారు.
మొత్తంగా అన్ని వర్గాలకు నచ్చేలా తీశాడు సుకుమార్. యాక్షన్, ఇంటెన్స్ డ్రామా , అద్భుతమైన విజువల్స్‌ను ఈ సినిమా మిళితం చేస్తుంది. అల్లు అర్జున్ కమాండింగ్ పెర్ఫార్మెన్స్ అందించాడు, దీనికి రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు.
ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్, లార్జ్ దేన్-లైఫ్ యాక్షన్ , గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో, ట్రైలర్ అభిమానులను థ్రిల్‌కి గురి చేసింది .