Thursday, April 24, 2025
HomeENTERTAINMENTకిక్కించే మూవీ పుష్ప 2 ది రూల్ - బ‌న్నీ

కిక్కించే మూవీ పుష్ప 2 ది రూల్ – బ‌న్నీ

ట్రైల‌ర్ లాంచ్ లో న‌టుడు అల్లు అర్జున్

బీహార్ – మోస్ట్ పాపుల‌ర్ హీరోగా పేరు పొందిన బ‌న్నీ అలియాస్ అల్లు అర్జున్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను న‌టించిన పుష్ప 2 ది రూల్ దుమ్ము రేపుతుంద‌న్నాడు. ఫ్యాన్స్ కు ప్ర‌ధానంగా ఈ చిత్రం కిక్కు ఎక్కిస్తుంద‌ని చెప్పాడు.

ఆదివారం బీహార్ రాజ‌ధాని పాట్నాలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో , మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన అల్లు అర్జున్ , ర‌ష్మిక న‌టించిన పుష్ప 2 ది రూల్ ట్రైల‌ర్ లాంచ్ గ్రాండ్ గా జ‌రిగింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. క‌నీ విని ఎరుగ‌ని రీతిలో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు.

ఈ సంద‌ర్బంగా అభిమానుల‌ను ఉద్దేశించి బ‌న్నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పుష్ప‌రాజ్ పార్ట్ 1 మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింద‌ని..ఇప్పుడు డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే పుష్ప 2 అంత‌కు మించి ఆనందాన్ని ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నాడు.

ఇక త‌న‌తో పాటు ర‌ష్మిక కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని, ఫ్యాన్స్ ఆశించిన దానికంటే ఎక్కువ‌గా రావ‌డం త‌న‌కు చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగించింద‌ని చెప్పారు. గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పినందుకు పాట్నా ప్ర‌జల‌కు థ్యాంక్స్ చెప్పారు బ‌న్నీ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments