ENTERTAINMENT

పుష్ప 2 ట్రైల‌ర్ కోసం పోటెత్తిన ఫ్యాన్స్

Share it with your family & friends

అభిమానుల‌తో నిండి పోయిన పాట్నా

బీహార్ – ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మ సినిమాకు సంబంధించి తొలిసారిగా బీహార్ రాజ‌ధాని పాట్నాలో పుష్ప 2 మూవీ ట్రైల‌ర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వేలాది మంది అభిమానులు ఇక్క‌డికి త‌ర‌లి వ‌చ్చారు.

బీహార్ రాష్ట్ర సినీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. క‌నీ విని ఎరుగ‌ని రీతిలో పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ సంద‌ర్బంగా అభిమానుల హ‌ర్ష ధ్వానాల మ‌ధ్య పుష్ప 2 ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు బీహార్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి విజ‌య్ చౌహాన్. త‌మ ప్ర‌భుత్వం సినీ రంగానికి ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ పుష్ప 2 ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న సినీ నిర్మాత‌లను ప్ర‌త్యేకంగా అభినందించారు.

సినీ రంగానికి చెందిన వారిని ప్రోత్స‌హిస్తుంద‌ని తెలిపారు. ఈ ఈవెంట్ చ‌రిత్ర‌లో నిలిచి పోయేలా ఉంటుంద‌న్నారు. పుష్ప‌2కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా న‌టించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఆయ‌న అందించిన పాట‌లు ఇప్ప‌టికే దుమ్ము రేపుతున్నాయి.