పుష్ప-2 మూవీ పోస్టర్ వైరల్
దీపావళి పండుగ సందర్బంగా
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికా మందన్నా కలిసి నటించిన పుష్ప -2 చిత్రం దుమ్ము రేపుతోంది. ఇంకా విడుదల కాకుండానే రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళితో పాటు సుకుమార్ కూడా ఒకరు.
ఇదే సమయంలో ఏకంగా పుష్ప-2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్ , సాంగ్స్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి. చంద్రబోస్ మరోసారి తన కలాన్ని జులిపించగా దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునేలా ట్యూన్స్ కట్టాడు. ఇప్పటికే విడుదలైన పాటలు దుమ్ము రేపుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ను మరింత అలరిస్తున్నాయి.
పుష్ప -2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెర కెక్కించారు. ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మరో వైపు ఈ మూవీ విడుదల కాకుండానే రూ.1000 కోట్లు వసూలు చేసింది. పుష్ప -2 పూర్తయ్యేంత వరకు దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు ఈ ఏడాడి డిసెంబర్ 5న పుష్ప చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ . తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఎక్స్ వేదికగా పుష్ప-2 పోస్టర్ ను రిలీజ్ చేశారు.