పుష్ప -2 పీలింగ్స్ సాంగ్ కెవ్వు కేక
రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 మూవీకి సంబంధించి ఆదివారం మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. పీలింగ్స్ అనే పేరుతో తొలుత మలయాళంలో విడుదల చేశారు. దానిని తెలుగులో చంద్రబోస్ రాశారు.
ఇప్పటికే విడుదలైన పాటలతో పోలిస్తే ఈ సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇక పోటీ పడి నటించారు అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రిలీజ్ అయిన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ చేశాడు.
ఇదిలా ఉండగా పుష్ప 2 మూవీ రికార్డు బ్రేక్ చేసింది. దేశ వ్యాప్తంగా మూవీ ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేసింది. రిలీజ్ కాకుండా రికార్డుల మోత మోగిస్తోంది పుష్ప -2 మూవీ. ఇప్పటికే రూ. 1,000 కోట్లు దాటిందని, రాబోయే రోజుల్లో అది రూ. 2000 కోట్ల మార్క్ అందుకోవచ్చని అంచనా.