బాలీవుడ్ ను షేక్ చేస్తున్న పుష్ప-2
రికార్డు స్థాయిలో టికెట్లు అమ్మకం
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల కాకుండానే రికార్డు బ్రేక్ చేసింది.
పుష్ప2 మూవీ టికెట్స్ సేల్స్ బాలీవుడ్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. కేవలం 10 గంటల వ్యవధిలోనే 55 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ప్రధాన థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్ప -2 మూవీ యానిమల్, గదర్ 2 ను దాటేసింది.
దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా 12,000 థియేటర్లలో పుష్ప -2 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ముందస్తుగా రూ. 1,000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ క్రేజ్ ఇలాగే కొనసాగుతూ పోతే 6 లక్షలకు పైగా ముందస్తు టికెట్లు అమ్ముడు పోయే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ బాహుబలి-2 పై ఉంది. 2017లో 6.5 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. పుష్ప-2 మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.