వెండి తెరపై పుష్ప 2 మెస్మరైజ్
రిలీజ్ కాకుండానే రికార్డుల మోత
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప -2 మూవీపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎక్కడ చూసినా బన్నీ, రష్మిక ఫీవర్ కొనసాగుతోంది. ఫ్యాన్స్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ల కోసం పోటీ కొనసాగుతోంది. అన్ని చోట్లా రికార్డుల మోత మోగించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ మ్యాజిక్ చేశాడు. ఇక చంద్రబోస్ కలం మరోసారి జూలు విదిల్చింది. ప్రతి పాటా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో పుష్ప 2 మూవీని రూపొందించాడు.
గతంలో ఏ హీరో చేయని సాహసం అల్లు అర్జున్ ఇందులో చేశాడని, అందుకే ఇంత సమయం పట్టిందని చెప్పాడు . మొత్తంగా ఐకాన్ స్టార్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డ్యాన్సులు, మాటలు, మేనరిజం పుష్ప 2 సినీ ఇండస్ట్రీలో అంచనాలు మరింత పెంచేలా చేశాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12,000 థియేటర్లలో చిత్రం విడుదల కానుంది. ఇది సినీ చరిత్రలో ఓ రికార్డ్.