పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్
వరల్డ్ వైడ్ గా రికార్డ్ ల మోత
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డైనమిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల దుమ్ము రేపారు.
పుష్ప రాజ్ -1 చిత్రంలో నటించిన నటులతో పాటు కొత్తగా రావు రమేష్, ప్రకాశ్ రాజ్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ కొట్టారు నిర్మాతలు నవీన్ , రామ్ ఎర్నేని.
అంతే కాకుండా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆశించిన దానికంటే అత్యధికంగా వసూళ్లు రాబడుతోందని సినీ వర్గాల టాక్. కిస్సక్ పాటకు లవ్లీ గర్ల్ శ్రీలీల, బన్నీ కలిసి పోటీ పడి నటించారు .