ENTERTAINMENT

పుష్ప‌-2 వ‌ర‌ల్డ్ ఫైర్ మూవీ సూప‌ర్

Share it with your family & friends

ఓవ‌ర్సీస్ లో రికార్డుల మోత
హైద‌రాబాద్ – అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత ఉత్కంఠ‌ను రేపింది సుకుమార్ తీసిన పుష్ప‌-2 ది రూల్. ఓవ‌ర్సీస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ స్కీన్ పండించిన విధానం, అల్లు అర్జున్ న‌ట‌న‌, ర‌ష్మిక మంద‌న్నా హావ భావాలు సినిమాకు హైలెట్ గా మార‌నున్నాయి. ప్ర‌త్యేకించి స్పెష‌ల్ సాంగ్ లో శ్రీ‌లీల మెస్మ‌రైజ్ చేసింది.

ఇక సినిమా వ‌ర‌కు వ‌స్తే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది ఈ మూవీ. ఎప్ప‌టి లాగే రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ త‌న‌దైన శైలిలో మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇక పాత్రల ప‌రంగా చూస్తే అంద‌రూ మ‌న‌సు పెట్టి చేశారు. ఒక ర‌కంగా పుష్ప 2కు ప్రాణం పోశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

పుష్ప రాజ్ పాత్ర‌లో బ‌న్నీ, బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ గా ఫ‌హాద్ ఫాసిల్ , శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక మంద‌న్నా, జ‌గ‌దీప్ ప్ర‌తాప్ బండారీ కేశ‌వ‌, సునీల్ మంగ‌ళం శ్రీ‌ను, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ , దాక్షాయ‌ణి, రావు ర‌మేష్, భూమి రెడ్డి, ధ‌నంజ‌య‌, మోహ‌న్, శ్రీ తేజ్ , మైమ్ గోపి, ఎస్ఐ గా బ్ర‌హ్మాజీ, పార్వ‌త‌మ్మ‌గా క‌ల్ప‌ల‌త న‌టించారు.
జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లలో పోషించారు. మొత్తంగా సినీ చ‌రిత్ర‌లోనే పుష్ప -2 రికార్డు సృష్టించ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు .