DEVOTIONAL

9న శ్రీవారి ఆలయంలో పుష్ప యాగం

Share it with your family & friends

భ‌క్తుల‌కు షాక్..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్ప యాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.

ఇదిలా ఉండ‌గా 8న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు.

9న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.