రిలీజ్ కాకుండానే పుష్ప2 మూవీ రికార్డ్
రూ. 1000 కోట్లకు పైగానే వసూలు
బీహార్ – ఎవరూ ఊహించని రీతిలో మైత్రీ మూవీ మేకర్స్ తమ సినిమాకు సంబంధించి తొలిసారిగా బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వేలాది మంది అభిమానులు ఇక్కడికి తరలి వచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పాటలకు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా రూ. 500 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు టాక్.
ఇదిలా ఉండగా రిలీజ్ కాకుండానే పుష్ప 2 రికార్డ్ మోత మోగించింది. ఏకంగా ప్రీ రిలీజ్ మార్కెట్ పరంగా రూ. 1000 కోట్లకు పైగానే వసూలు అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పుష్ప2 ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ చౌహాన్ హాజరయ్యారు.
మరో వైపు బీహార్ రాష్ట్ర సినీ చరిత్రలోనే తొలిసారిగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కనీ విని ఎరుగని రీతిలో పోలీసులను మోహరించారు. ఈ సందర్బంగా అభిమానుల హర్ష ధ్వానాల మధ్య పుష్ప 2 ట్రైలర్ ను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్. తమ ప్రభుత్వం సినీ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేయడం పట్ల ఆయన సినీ నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు.