పాట్నా నగరం అభిమాన సంధ్రం
పుష్ప2 మూవీ ట్రైలర్ లాంచింగ్
బీహార్ – సుకుమార్ తీసిన పుష్ప 2 ది రూల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ బీహార్ రాజధాని పాట్నాలో అంగరంగ వైభవంగా జరిగింది. నిర్వాహకులు ఊహించని రీతిలో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మైదానం మొత్తం నిండి పోయింది. ఇసుక వేస్తే రాలనంత ఫ్యాన్స్. ఐకాన్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది అనడానికి ఈ ఈవెంట్ చాలు.
ఇక నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్నాను చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది పోలీసులకు. బీహార్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా భారీగా పోలీసులను మోహరించారు. అయినా లాఠీ ఛార్జి తప్పలేదు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్ విచ్చేశారు. తమ ప్రభుత్వం సినీ రంగానికి సహాయ సహకారం అందజేస్తుందని ప్రకటించారు. పుష్ప2 మూవీ సక్సెస్ కావాలని కోరారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక , మరాఠాతో పాటు ఇప్పుడు బీహార్ లో సైతం అల్లు అర్జున్ తన హవా కొనసాగిస్తుండడం విశేషం. రిలీజ్ కాకుండానే పుష్ప 2 మూవీ రికార్డులు సృష్టించింది.