ఫ్యాన్స్ జోష్ రష్మిక ఖుష్
పుష్ప2 మూవీలో సూపర్
బీహార్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ రికార్డు మోత మోగిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన పుష్ప2 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బీహార్ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ బందోబస్తు మధ్య బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప2 మూవీ ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్ విచ్చేశారు.
ఈ సందర్బంగా మరోసారి శ్రీవల్లి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా రిలీజ్ కాకుండానే పుష్ప 2 మూవీ వసూళ్లలో రికార్డుల మోత మోగించడం విశేషం. ఇప్పటికే రూ. 1000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఇక సినిమాకు సంబంధించి అన్నీ తానై వ్యవహరించారు సూపర్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్. ఇక స్పెషల్ సాంగ్ లో అలరించనుంది లవ్లీ నటిగా పేరు పొందిన శ్రీలీల. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.