మూవీ ట్రైలర్ అదుర్స్
బీహార్ – బీహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన పుష్ప2 మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు దర్శకుడు సుకుమార్. ఎప్పటి లాగే తన అరుదైన మేనరిజంతో ఆకట్టకునే ప్రయత్నం చేశాడు ఐకాన్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్.
ఇక నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్నా బన్నీతో పోటీ పడి నటించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఎప్పటి లాగే ఆకట్టుకునేలా స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ స్పెషల్ సాంగ్ లో సూపర్ లేడీగా పేరు పొందిన శ్రీలీల నటించనుంది. దీంతో పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పరాజ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాంకేతిక పరంగా అత్యున్నతమైన స్థాయిలో ఉంది. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్ లో సాంగ్స్ ఇచ్చాడు. ఇక పుష్ప2కు సంబంధించి మరో విషయం ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పక తప్పదు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.