ఐ లవ్ యూ పాట్నా – రష్మిక మందన్నా
పుష్ప2 ది రూల్ మూవీ ట్రైలర్ లాంచ్
బీహార్ – నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్నా మరోసారి వైరల్ గా మారారు. ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఎవరూ ఊహించని రీతిలో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో , మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అల్లు అర్జున్ , రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కనీ విని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లను చేశారు.
ఈ సందర్బంగా అభిమానులను ఉద్దేశించి రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్పరాజ్ పార్ట్ 1 మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిందని..ఇప్పుడు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే పుష్ప 2 అంతకు మించి మీకు కిక్ ఇచ్చేలా చేస్తుందని చెప్పారు.
తామిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని, ఫ్యాన్స్ ఆశించిన దానికంటే ఎక్కువగా రావడం తనకు చెప్పలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. గ్రాండ్ వెల్ కమ్ చెప్పినందుకు పాట్నా ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు రష్మిక మందన్నా.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేస్తోంది. విడుదలైన పాటలు దుమ్ము రేపుతున్నాయి. కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.