దాడులపై పుతిన్ కన్నెర్ర
సిరియాపై దాడులకు దళాలు
రష్యా – రష్యాను టార్గెట్ చేస్తూ రాజధాని మాస్కోలో ఐసీఐఎస్ ఆధ్వర్యంలో ఉగ్ర మూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సందర్బంగా శనివారం సంచలన ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్. ఈ మేరకు సిరియాకు వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశం వేదికగా ఐఎస్ఐఎస్ పని చేస్తోంది.
దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు పుతిన్. ఈ మేరకు తమ దళాలను సిరియాకు పంపిస్తున్నట్లు ప్రకటించారు . తమపై దాడులకు దిగిన వారు ఎక్కడున్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ జల్లెడ పడతామని, ఎక్కడ దాక్కున్నా వదలమని అన్నారు పుతిన్.
మరో వైపు మాస్కో దాడి ఘటనతో ఒక్కసారిగా ఉక్రెయిన్ అలర్ట్ అయ్యింది. ముందస్తుగా అమెరికా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏ రూపంలోనైనా రష్యా దీనిని సాకుగా చూపించి దాడికి దిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది.
అయితే ముస్లింలను అణిచి వేసేందుకు రష్యా ప్రయత్నం చేస్తోందంటూ ఐసీఐఎస్ మూకలు భావిస్తున్నాయి. అందుకే దాడులకు తెగబడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సిరియాపై మరోసారి బాంబులు, దాడుల వర్షం కురిపించే ఛాన్స్ లేక పోలేదు.