జాతీయ జెండాతో ఒలింపిక్స్ లో
పారిస్ – భారత దేశానికి చెందిన అథ్లెట్, ఏపీకి చెందిన పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. పారిస్ వేదికగా ప్రస్తుతం ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు. ఆయా దేశాల తరపున సీనియర్ అథ్లెట్లకు అరుదైన గౌరవం లభించడం ఆనవాయితీగా వస్తోంది.
తమ దేశం తరపున ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల తరపున ఆయా దేశాలకు చెందిన జాతీయ పతకాలను ప్రదర్శించే అవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ దక్కదు. ఇందు కోసం దేశం తరపున ఆడాలని అనుకోవటమే కాకుండా నేషనల్ ఫ్లాగ్ ను ధరించాలని, ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తమకు దక్కాలని తమ ఇష్ట దైవాన్ని కోరుకుంటారు.
ఇలాంటి అద్భుతమైన అవకాశం మన తెలుగు వారి బిడ్డ పీవీ సింధుకు జాతీయ పతాకాన్ని ప్రదర్శించే ఛాన్స్ లభించింది పారిస్ లో . ఇందుకు సంబంధించి స్వయంగా శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది అథ్లెట్ సింధు.