NEWSTELANGANA

తొలి నుంచి నేను ఆర్ఎస్ఎస్ వాదినే

Share it with your family & friends

బీజేపీ ఎంపీ ర్యాగ కృష్ణ‌య్య కామెంట్స్

హైద‌రాబాద్ – బీజేపీ ఎంపీ ర్యాగ కృష్ణ‌య్య షాకింగ్ కామెంట్స్ చేశారు. మొద‌టి నుంచి తాను ఆర్ఎస్ఎస్ వాదినేన‌ని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను స‌మాజం త‌ప్పుగా అర్థం చేసుకుంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను చేస్తున్న పోరాటాల‌కు మూలాలు ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని, నిస్వార్థంగా సేవ చేయ‌డం, అవినీతికి దూరంగా ఉండ‌డం అన్నారు కృష్ణ‌య్య‌.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న ప‌లు పార్టీలు మారారు. దేశంలో బీసీల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం వ్య‌వ‌స్థాప‌కుడిగా ఎన్నో పోరాటాలు చేశారు. ఆర్. కృష్ణ‌య్య అంటేనే బీసీ ఉద్య‌మం గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సైతం కీల‌క భూమిక పోషించారు.

బీసీ ఉద్య‌మ నాయ‌కుడిగా ఉన్న ఆర్. కృష్ణ‌య్య‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌ర్వాత అనుకోకుండా వైఎస్సార్సీపీ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి పిలిచి ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపీగా పంపించారు.

ఎన్నిక‌ల‌కు ముందు కృష్ణ‌య్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *