ప్రజా ప్రభుత్వం కాదు కమీషన్ల సర్కార్
నిప్పులు చెరిగిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్ – బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు .ఇది ప్రజా ప్రభుత్వం కానే కాదని కమీషన్లతో నడుస్తున్న సర్కార్ అంటూ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇవ్వాలన్నారు . 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.
పైకి పేదలు, బడుగలు, బలహీన వర్గాల జపం చేస్తూ మరో వైపు అణగారిన వర్గాలను మరింత అధః పాతాళానికి సీఎం తొక్కేస్తున్నాడని, కేవలం తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.
పాలక మండలి సభ్యులను వెంటనే నియమించాలని కోరారు. సమాజంలో బీసీలు మరింత ఎదగేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు స్వంత భవనాలు లేవన్నారు. వాటిని తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు ఎంపీ ర్యాగె కృష్ణయ్య.