మోహన్ బాబుకు సీపీ డెడ్ లైన్
మంచుకు స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ – రాచకొండ సీపీ సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటుడు మోహన్ బాబుకు. ఈనెల 24 వరకు టైం ఇచ్చామన్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులకు స్పందించక పోతే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
సుధీర్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబును విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతామని చెప్పారు. చంద్రగిరిలో లైసెన్స్డ్ గన్ ను సరెండర్ చేశారని తెలిపారు. మోహన్ బాబు వద్ద రెండు వెపన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు సీపీ.
పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. మోహన్ బాబును వదిలి వేసే ప్రసక్తి లేదన్నారు. అరెస్ట్ చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు సీపీ సుధీర్ బాబు.
ఇదిలా ఉండగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు మోహన్ బాబు, మనోజ్, విష్ణు. జల్ పల్లి వద్ద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మోహన్ బాబు రెచ్చి పోయి మీడియాపై దాడికి దిగారు. టీవీ9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. మైకు తీసుకుని కొట్టారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు.