మోహన్‌బాబు మేనేజర్ అరెస్ట్ – సీపీ
వెల్లడించిన సుధీర్ బాబు
హైదరాబాద్ – రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మేనేజర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని అన్నారు. మంచు ఫ్యామిలీ పరంగా మూడు కేసులు నమోదు చేశామన్నారు సీపీ. మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిపై కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు .
అయితే మంచు మనోజ్ ఫిర్యాదుతో మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతోనే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. మంచు మనోజ్, మంచు విష్ణులతో రూ. 1 లక్ష చొప్పున బాండు తీసుకున్నామని వెల్లడించారు సీపీ.
అయితే ఇక నుంచి మోహన్ బాబు ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగందన్నారు . కుటుంబ పరంగా పోలీసులు ఎప్పుడూ జోక్యం చేసుకోరన్నారు. కానీ పరిస్థితి చేయి దాటినందు వల్లనే తాము కేసు నమోదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. మోహన్ బాబు కోర్టుకు విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.