ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్
రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కామెంట్
అమరావతి – వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని సీఎం ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. 2030 అంటూ ఊకదంపుడు హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
కూటమిలో ఎవరికి వారే కామెంట్స్ చేస్తున్నారని , పాలనా పరంగా బక్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో కొలువు తీరిన కూటమి పాలనలో 100 రోజుల్లో 100 అత్యాచారాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
విచిత్రం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేబినెట్ అనేది ఉందా అన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు.