సప్త వాహనాలపై ఊరేగిన స్వామి
తిరుపతి – తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.స్వామి, అమ్మ వార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు. స్వామి అనుగ్రహం కోసం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపు పందిరి, సర్వ భూపాల వాహనాలపై స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు.
సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.