ENTERTAINMENT

డ్ర‌గ్స్ కేసులో మోడ‌ల్ లిపి గ‌ణేష్

Share it with your family & friends

రాడిస‌న్ బ్లూ హోటల్ దందా

హైద‌రాబాద్ – రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ డ్ర‌గ్స్ కు అడ్డాగా మారింది. సీపీగా అవినాష్ మ‌హంతి కొలువు తీరాక దాడుల పరంప‌ర మొద‌లైంది. న‌గ‌రంలోని గ‌చ్చి బౌలి వ‌ద్ద ఉన్న రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో డ్ర‌గ్స్ దందా కొన‌సాగుతోంద‌ని స‌మాచారం అందడంతో పోలీసులు దాడులు చేప‌ట్టారు. ప‌లువురు ప‌ట్టుబ‌డ్డారు. వీరిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఓ నేత కొడుకు కూడా ఉండ‌డం విశేషం.

అంతే కాదు హీరో అల్లు అర్జున్ వ్యాపారాల్లో భాగ‌స్వామిగా ఉన్న కేదార్ నాథ్ కూడా ప‌ట్టుబ‌డ్డాడ‌ని, అత‌డిని త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ కేసులో మ‌రోసారి ప‌ట్టుబ‌డింది మోడ‌ల్ లిపి గ‌ణేష్. ఆమె గ‌తంలో కూడా చిక్కిన‌ట్టే చిక్కి త‌ప్పించుకుంది.

దాడుల్లో ప‌ట్టుబ‌డిన వారిలో టెస్టులు నిర్వ‌హించ‌గా ముగ్గురికి పాజిటివ్ అని తేలింద‌ని చెప్పారు సీపీ అవినాష్ మ‌హంతి. ఇదిలా ఉండ‌గా రెండు సంవ‌త్స‌రాల కింద రాడిస‌న్ హోట‌ల్ , మింక్ ప‌బ్ డ్ర‌గ్ కేసులో క‌ల్ల‌పు కుషిత‌, ఆమె సోద‌రి క‌ల్ల‌పు లిపి గ‌ణేష్ ప‌ట్టుబ‌డ్డారు. మ‌రోసారి ప‌ట్టుబ‌డ‌డం విస్తు పోయేలా చేసింది.

ఈ ఇద్ద‌రు గ‌తంలో ప‌ట్టుబ‌డిన స‌మ‌యంలో డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని చిలుక ప‌లుకులు ప‌లికారు. ఆనాడు చీజ్ బ‌జ్జీలు మాత్ర‌మే ఆర్డ‌ర్ ఇచ్చామంటూ అబ‌ద్దం చెప్పారు.