డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కొడుక్కి ఊరట
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
హైదరాబాద్ – భాగ్యనగరంలోని గచ్చి బౌలిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో మంజీర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ వివేకానంద కూడా పట్టుబడ్డారు. ఆయనతో పాటు ఓ మోడల్ కూడా ఉండడం విశేషం.
అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఇప్పటికే ప్రకటించారు సీపీ అవినాష్ మహంతి. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో వివేకానంద ఎవరో కాదు భారతీయ జనతా పార్టీకి చెందిస సీనియర్ నాయకుడి కొడుకు కావడం విశేషం.
తాజాగా ఈ కేసుకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. గచ్చి బౌలి హౌస్ ఆఫీసర్ జేమ్స్ బాబు వివరాలు వెల్లడించారు. సాచెట్ లు , వైద్య పరీక్షల్లో కొకైన్ జాడలు మాత్రమే లభించాయని తెలిపారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ కొడుక్కి ఊరట లభించింది. ఆయన రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీ కత్తుపై న్యాయమూర్తి విడుదల చేయాలని ఆదేశించారు.
సినీ నిర్మాత కేదార్ సెలగం శెట్టి సహా మరో ఇద్దరు నిందితుల నమూనాలను పోలీసులు సేకరించారు. ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.