ENTERTAINMENT

డైరెక్ట‌ర్ క్రిష్ క‌నిపించడం లేదు

Share it with your family & friends

గ‌చ్చిబౌలి స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లోని రాడిస‌న్ బ్లూ ప్లాజా డ్ర‌గ్స్ కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను కేవ‌లం గ‌జ్జెల వివేకానంద్ ను క‌లిసేందుకు వెళ్లాన‌ని, తాను డ్ర‌గ్స్ తీసుకోలేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్ క్రిష్. ఆ త‌ర్వాత పోలీస్ బాస్ అవినాష్ మ‌హంతి వివేకాతో పాటు క్రిష్ కూడా డ్ర‌గ్స్ సేవించాడ‌ని విచార‌ణ‌లో తేలింద‌ని పేర్కొన్నారు. దీంతో తీగ లాగితే డొంకంతా క‌దులుతోంది. ఈ కేసులో మొత్తం 10 మందిని చేర్చారు పోలీసులు.

తాజాగా గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఇన్సెప‌క్ట‌ర్ జేమ్స్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న స్పందించారు. ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్నాడ‌ని, సోమ‌వారం హాజ‌ర‌వుతాన‌ని చెప్పాడ‌ని తెలిపారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించడం లేదని, మూడు రోజులు అవుతోంద‌న్నారు.

మ‌రో నిందితుడు చ‌ర‌ణ్ అట్లూరి పార్టీలో లేనంటూ తెలిపాడ‌ని వెల్ల‌డించారు. ఆయ‌న న‌మూనాల‌ను కూడా తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. న‌టి లిషి గ‌ణేష్ కూడా క‌నిపించ‌కుండా పోయింద‌న్నారు.