కేసీఆర్ సెంటిమెంట్ పని చేయదు
రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా మాటల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.
ఎన్ని సార్లని తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటారంటూ ధ్వజమెత్తారు రఘు నందన్ రావు. నల్లగొండ లో సభ ఎవరి కోసం, ఎందు కోసం పెట్టారో చెప్పాలన్నారు. ఓ వైపు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా బయట ఉండి మాట్లాడితే ఎలా అని నిలదీశారు .
దీనిని నాలుగున్నర కోట్ల ప్రజానీకం జీర్ణించు కోలేరన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయని , వీటిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ చిల్లర రాజకీయాలు చేసేందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు రఘు నందన్ రావు.
ఒకవేళ తెలంగాణపై సోయి ఉంటే, లేదా అంతకు మించి ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తాడని కానీ ఇది మాత్రం చేయడం లేదన్నారు . పోరాట సభ అంటూ ఉత్త కోతలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ సభ కాక పోతే మరేమిటి అని ప్రశ్నించారు.