రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మాజీ డీఎస్పీ , సస్పెండ్ అయిన ప్రణీత్ రావు కేంద్రంగా జరిగిన విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు సారథ్యంలోనే ఈ తతంగం అంతా జరిగినట్టు నిగ్గు తేల్చారు పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు.
దీంతో గత కేసీఆర్ సర్కార్ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో బయటకు వస్తున్నారు. తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. తాజాగా వీరి జాబితాలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు చేరి పోయారు. వారిలో ఒకరు పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాగా మరొకరు భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు.
ఆయన మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై. తొలి బాధితుడు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాగా తాను రెండో బాధితుడినని సంచలన వ్యాఖ్యలు చేశారు.