ప్రజలు మేల్కోక పోతే ప్రమాదం
హెచ్చరించిన రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం రఘురామ్ రాజన్ ట్విట్టర్ వేదికగా 143 కోట్ల మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఓటు అనేది వజ్రాయుధమని, దానిని సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని సూచించారు రఘురామ్ రాజన్. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే తమకేంటి అని ఇంటి వద్దనే ఉంటే నష్ట పోయేది నేతలు కాదని చివరకు ప్రజలేనని హెచ్చరించారు మాజీ గవర్నర్.
అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తాను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా ఉండాలని తన కోరిక అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు మరింత జాగురూకతో ఉండాలని సూచించారు.