రాహుల్ గాంధీది అసాధారణ యాత్ర
కితాబు ఇచ్చిన రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ట్విట్టర్ వేదికగా సోమవారం ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు.
తాను ఇప్పటి వరకు చూసిన యువ నాయకులలో రాహుల్ గాంధీ భిన్నమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయనకు ఈ దేశం పట్ల ఇంకా తెలుసు కోవాలన్న కోరిక ఉందన్నారు. ఇది తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నారు రఘు రామ్ రాజన్.
ఈ దేశంలో కొందరి చేతుల్లో మాత్రమే ప్రధాన స్రవంతి అయిన ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా మాధ్యమాలు పని చేస్తున్నాయని వాపోయారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులలో 4,080 కిలోమీటర్లు నడిచారని, ఇది మామూలు విషయం కాదన్నారు రఘురామ్ రాజన్.
రాహుల్ గాంధీలో పరిణతి చెందిన నాయకుడు కనిపిస్తున్నాడని కితాబు ఇచ్చారు. ఈ దేశానికి ఇలాంటి నేతలే కావాల్సిందని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ రాజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.