అర్నాబ్ వల్లే రాహుల్ కు డ్యామేజ్
మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
ముంబై – భారత దేశ ఆర్థిక వేత్త , మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రముఖ జర్నలిస్ట్ , రిపబ్లిక్ టీవీ ఛానల్ ఫౌండర్, అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై తీవ్రంగా మండిపడ్డారు. తన కెరీర్ లో అత్యంత సౌమ్యుడిగా ఉంటాడని పేరు తెచ్చుకున్న రాజన్ ఉన్నట్టుండి గోస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఓ జాతీయ ఛానల్ తో రఘురామ్ రాజన్ సంభాషించారు. ఈ సందర్బంగా అర్నాబ్ అనుసరిస్తున్న ధోరణి పూర్తిగా పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. గతంలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని తెలివి తక్కువ వాడిగా, పరిణతి చెందని నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు రఘురామ్ రాజన్.
బహిరంగంగానే అర్నాబ్ గోస్వామి భారతీయ జనతా పార్టీకి , ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మౌత్ పీస్ గా మారారంటూ పేర్కొన్నారు. ఇకనైనా రాహుల్ గాంధీ ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.