డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు
అమరావతి – డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయన మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందన్నారు. ఇలాగే అటెండ్ కాకుండా ఉంటే బై పోల్ వస్తుందని హెచ్చరించారు. తను అసెంబ్లీకి వస్తే మంచిందని సూచించారు.
మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. తాజాగా జగన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తన కుటుంబంతో కలిసి లండన్ టూర్ ముగించుకుని ఏపీకి విచ్చేశారు మాజీ ముఖ్యమంత్రి.
ఈ సందర్భంగా తనను ఉద్దేశించి రఘురామ కృష్ణమరాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు వైసీపీకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఆయనకు ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా చేశారు.