రాహుల్..అఖిలేష్ వైరల్
ఫలితాల వేల తీరని ఉత్కంఠ
న్యూఢిల్లీ – దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. దీనికి కారణం ఇంకొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కానీ ఈసారి వైరల్ గా మారారు యువ నాయకులు. ప్రధానంగా ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిలో హైలెట్ గా నిలిచారు. వారు ఎవరో కాదు యూపీకి చెందిన మాజీ సీఎం , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాగా.
మరొకరు భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలోనే సెన్సేషన్ గా మారిన రాహుల్ గాంధీ. మరో వైపు బీహార్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇంకో వైపు రేవంత్ రెడ్డి తెలంగాణలో టైగర్ గా నిలిచారు. మహారాష్ట్రలో తేజస్వి యాదవ్ , రాజస్థాన్ లో సచిన్ పైలట్ ..ఢిల్లీలో కన్హయ్య కుమార్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో యువ నాయకులు తెర పైకి వచ్చారు ఈసారి ఎన్నికల్లో.
ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ల సభలకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిద్దరికీ సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఏది ఏమైనా యువ నాయకత్వం దేశానికి అవసరం కదూ.