ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
అన్నా చెల్లెలు రాహుల్, ప్రియాంక
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం యూపీలోని రాయ్ బరేలిలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు.
తమ కుటుంబం గత 100 ఏళ్లుగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. . పండిట్ మోతీలాల్ నెహ్రూ జీ కాలం నుండి నేటి వరకు, రాయ్ బరేలీ ఎల్లప్పుడూ దేశానికి మార్గాన్ని చూపుతుందని అన్నారు రాహుల్ , ప్రియాంక గాంధీ.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. మరోసారి రాయ్ బరేలీ కుటుంబం ఏకమై న్యాయ జ్యోతిని వెలిగించేందుకు సిద్ధమైందని అన్నారు.
ఇవాళ రాహుల్ గాంధీ జీతో కలిసి, మహారాజ్‌గంజ్ , గుర్బక్ష్‌గంజ్‌లలో భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రియాంక గాంధీ. ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఓటు ఒక్కటే సమాధానం అని స్పష్టం చేశారు.