SPORTS

రాహుల్ రాక‌తో రాజ‌స్థాన్ రాత మారేనా

Share it with your family & friends

శాంస‌న్ జ‌ట్టుకు ద్ర‌విడ్ హెడ్ కోచ్

హైద‌రాబాద్ – వ‌చ్చే ఏడాది 2025 లో జ‌ర‌గ‌బోయే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో కీల‌క మార్పు చోటు చేసుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ను నియ‌మించింది. ఈమేర‌కు యాజ‌మాన్యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో జేక్ లష్ మెక్ క్రమ్ నుండి ద్రవిడ్ తన జెర్సీని అందుకుంటున్నట్లు చూపిస్తూ రాజ‌స్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ద్ర‌విడ్ ఎంపిక‌పై ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు.

ద్ర‌విడ్ సార‌థ్యంలో ఇటీవల కరీబియన్‌లో భారతదేశానికి చారిత్రాత్మక టి20 ప్రపంచ కప్ విజయాన్ని అందించాడు, కోచ్‌గా ద్రవిడ్ అసాధారణ నైపుణ్యాలను రుజువు చేసింది. గ‌తంలో ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున రాహుల్ ఆడాడు. అదే జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌స్తుతం తిరిగి త‌న జ‌ట్టుకు హెడ్ కోచ్ గా రావ‌డం విశేషం.

మ‌రో వైపు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కోచ్ గా ఉన్న కుమార సంగ‌క్క‌ర ఇంగ్లండ్ టీమ్ కు కోచ్ గా వెళ్ల‌డంతో ద్ర‌విడ్ త‌న స్థానంలో వ‌చ్చాడు.