SPORTS

కోచ్ గా క‌ప్ సాధించ‌డం అదృష్టం

Share it with your family & friends

హెడ్ కోచ్ ది వాల్ రాహుల్ ద్ర‌విడ్

బ్రిడ్జ్ టౌన్ – వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాను 7 ప‌రుగుల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా భార‌త జ‌ట్టును ముందుండి న‌డిపించిన మాజీ క్రికెట‌ర్, ది వాల్ గా పేరు పొందిన రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఒక క్రికెట‌ర్ గా , భార‌తీయ పౌరుడిగా తాను వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకునే అదృష్టాన్ని పొంద లేక పోయాన‌ని అన్నాడు. ఇదే క్ర‌మంలో జ‌ట్టుకు హెడ్ కోచ్ గా (మార్గ‌ద‌ర్శ‌కుడిగా) విశిష్ట సేవ‌లు అందించాను. జ‌ట్టులో కొన్ని లోపాలు ఉండ‌టం స‌హ‌జ‌మే. వాటిని గుర్తించి మ‌రోసారి త‌ప్పులు చేయ‌కుండా ఉండ‌డ‌మే కావాల్సింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఇవాళ నా జీవితంలో మ‌రిచి పోలేని రోజుగా అభివ‌ర్ణించాడు. నా మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో టీమిండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం సంతోషం క‌లిగిచింద‌ని చెప్పాడు. ఒక ర‌కంగా అద్భుత‌మైన క్ష‌ణాలు న‌న్ను ఒక చోట ఉండ‌నీయ‌డం లేద‌న్నాడు రాహుల్ ద్ర‌విడ్.